కనకం కొత్త అవతారం..రౌడీ మైఖేల్ కి చెక్ పెట్టనుందా!
on Sep 29, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -214 లో.. స్వప్నని కిడ్నాప్ చేసిన మైఖేల్ తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. రాహుల్ కి మాత్రం స్వప్నని చంపేశామని మైఖేల్ అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత స్వప్నని పెళ్లి చేసుకోవడానికి మైఖేల్ పంతులు గారి దగ్గరికి వస్తాడు. కనకం పూజారి వేషంలో ఉంటుంది. కనకాన్ని చుసి.. నాకు పురోహితురాలు వద్దు పురోహితుడు కావాలని మైఖేల్ అనగానే.. మాయమాటలు చెప్పి మైకేల్ ని ఒప్పిస్తుంది కనకం.
ఆ తర్వాత చేసేదేమీ లేక సరే అని పూజారి వేషంలో ఉన్న కనకాన్ని తీసుకొని వెళ్తాడు మైఖేల్. మరొక వైపు స్వప్నని ఎవరు కిడ్నాప్ చేశారు. అంత పగ ఎవరికి ఉందంటూ కావ్య బాధపడుతుంది. స్వప్నపై మాత్రమే అనుకుంటే ఎలా రాజ్ మీద ఉండొచ్చు, రాహుల్ మీదు ఉండొచ్చని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రుద్రాణి రాహుల్ దగ్గరికి వెళ్తుంది. నా యాక్టింగ్ ఎలా ఉందని రాహుల్ అడుగుతాడు. స్వప్న చనిపోయిందని రాహుల్ చెప్తాడు. అది విని రుద్రాణి సంతోషంగా.. మంచి పని జరిగింది. నా కొడుకుని గొప్పింటికి అల్లుడు చేద్దామని అనుకున్నా, ఆ కావ్య మొత్తం డిస్సపాయింట్ చేసింది. ఇప్పుడు ఆ కావ్య వాళ్ళ గురించి బాధలో ఉంటుందని రుద్రాణి సంబరపడిపోతుంది మరొకవైపు కనకం పూజారి వేషంలో ఉన్న విషయం మర్చిపోయి స్వప్నని చూడాలని హడావిడిగా కార్ దిగి వెళ్తుంటే మైఖేల్ కి డౌట్ వస్తుంది. కానీ కనకం మళ్ళీ డైవర్ట్ చేస్తుంది.
ఆ తర్వాత లోపలికి వెళ్లి.. స్వప్న కోసం కనకం చూస్తుంటుంది. కాసేపటికి మైఖేల్ మనుషులు స్వప్నని తీసుకొని వస్తారు. అప్పుడు కనకం నేను అమ్మనే అంటూ సైగ చేస్తుంది. మైఖేల్ దగ్గర ఫోన్ తీసుకొని మా ఆయనకి చేస్తున్నానంటూ మైఖేల్ కి తెలియకుండా కావ్యకి లొకేషన్ ని షేర్ చేసి, వీడియో కాల్ చేసి అక్కడ జరిగేది మొత్తం చూపిస్తుంది కనకం. దాంతో కావ్య, రాజ్ ఇద్దరు అక్కడికి బయలుదేర్తారు. మరొక వైపు కనకానికి పెళ్లి చెయ్యడానికి మంత్రాలు రాకపోవడంతో.. ఏదో ఒకటి కవర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
